Tuesday, March 10, 2026

అవసరమైతే నా ఇల్లు కూడా అమ్ముతా

నేను మీ బిడ్డను

మంత్రి వాకిటి శ్రీహరి

నేటిసాక్షి నారాయణపేట. జూన్ 27,

కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టుకొలేని బీద పరిస్థితిలో ఉన్న వారికి, పేదింటి వారికి సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశంతో నేడు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మినీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు మరియు యువజన శాఖ మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి , జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్

అనంతరం గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ, మీ ఇండ్ల నిర్మాణం ఎంత త్వరగా ప్రారంభిస్తారో అంత త్వరగా మీకు మీ అకౌంట్లో బిల్లులు పడతాయని ఒకవేళ మీకు బిల్లులు పడని ఎడల అవసరమైతే నా ఇల్లు అమ్మేనా మీ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసే బాధ్యత నాది అని గౌరవ మంత్రివర్యులు అన్నారు.

నేను ఈరోజు మీ ముందు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడుతున్న అంటే నాపైన మీరు చూపించినటువంటి ప్రేమ ఆదరాభిమానాలకు నేను నా జీవితాంతం అన్నగా,తమ్ముడిగా, కొడుకుగా మీ విధేయునిగా నిరంతరం పనిచేస్తానని అన్నారు.

రానున్న రోజుల్లో మొత్తం అభివృద్ధి రూపురేఖలు మారుపోతున్నాయి. అందులో భాగంగానే నేడు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో సుమారు 600 కోట్ల నిధులను తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధి రూపురేఖలను మార్చి చూపిస్తానని గౌరవ మంత్రి అన్నారు

ఇట్టి కార్యక్రమంలో మక్తల్ మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News