Tuesday, March 17, 2026

*అవార్డు అందుకున్న దంత వైద్యురాలు సృజన*——————————————–జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు……………………………….. ……వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు అవార్డులు అందుకోగా అందులో జగిత్యాల జిల్లా నుండి ప్రముఖ దంత వైద్యురాలు సి హెచ్. సృజన ఉండగా ఆమెను పలువురు అభినందించారు.హైదరాబాద్ కూ చెందిన ముందడుగు న్యూస్ ఛానెల్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి రాష్ట్రంలో వివిధ రంగాల్లో సేవా చేస్తున్న వారిని గుర్తించగా జగిత్యాల జిల్లాలో వెయ్యికి పైగా ఉచిత దంత వైద్య శిభీరాలు నిర్వహించి మందులు సైతం ఉచితంగా అందించి సామాజిక సేవచేస్తున్న సృజన దంత హాస్పిటల్ వైద్యురాలు సి హెచ్. సృజన కూ అవార్డు అందజేశారు.హైదరాబాద్ లో ప్రముఖుల చేతుల మీదుగా సృజన అవార్డు అందుకున్నారు.డాక్టర్ సృజన అవార్డు అందుకోవడం పట్ల జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుణగరి శ్రీనివాస్,బుగ్గారాం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దూడ చిరంజీవి,ఆముద లింగారెడ్డి, జైపాల్, పాత్రికేయులు నరేందర్ రావు, శ్రీనివాస్ రావు చింత రోజా, బోరగాళ్ల లావణ్య, మహేంద్రనాథ్, నక్క సతీష్, జవ్వాజి శంకర్, లక్ష్మణ్, రమణ,కల్లెడ తిరుపతి,తదితరులు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News