Saturday, March 21, 2026

అసలైన దోషిని వదిలేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపా.. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికూటమి నేతలకు నిజాయితీ ఉంటే విదేశాల్లో దాక్కున్న నిందితుడిని రప్పించి అరెస్టు చేయించాలి..!జయచంద్రారెడ్డి అసలు సూత్రధారంటూ సాక్షాత్తు టీడీపీ వాళ్లే సోషల్ మీడియాలో పోస్టులు.. నిస్సార్ అహ్మద్

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: తంబళ్లపల్లె కోర్టు వద్దకు విచ్చేసిన బీసీ నేత, మాజీ మంత్రి జోగి బ్రదర్స్ జోగి రమేష్, జోగి రాములను కలవడానికి స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ వచ్చారు. వీరితో పాటు పెద్ద ఎత్తున బీసీ నేతలు, నాయకులు, వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. మీకు అండగా మేమున్నామంటూ భరోసా కల్పించారు. తంబళ్లపల్లి కోర్ట్ ప్రాంతం నినాదాలతో దద్దరిల్లింది. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా కూడా కూటమినేతలు కక్ష సాధింపుకు పాల్పడుతూ లేని కేసును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము లపై బనాయించారు. ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై అసలు దోషి టీడీపీ తంబళ్లపల్లి ఇంచార్జ్ నేత దాసరపల్లి జయచంద్రారెడ్డిని వదిలిపెట్టి చేయని నేరాన్ని అన్నదమ్ములపై మోపి కూటమి నేతలు అరెస్ట్ చేయించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం తంబళ్లపల్లి కోర్టుకు జోగి రమేష్, జోగి రాములను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ కోర్టులో హాజరు పరిచారు. తంబళ్లపల్లి కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. మళ్లీ వీళ్లను భారీ భద్రత నడుమ నెల్లూరు జైలుకు తరలించారు. ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ శాఖ పోలీసులు 32, 33 నిందితులుగా చేర్చారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వెలుపల తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లి టీడీపీ నేత దాసరపల్లి జయచంద్రారెడ్డి ని వదిలిపెట్టి మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ ను మరియు ఆయన తమ్ముడిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సీబీఐ ద్వారా దర్యాప్తు చేయిస్తే అసలు దోషులు బయటకు వస్తారని కానీ కూటమి నేతలు అసలు దోషి దాసరపల్లి జయచంద్రారెడ్డిని దాచిపెట్టి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారని అసలు జోగి రమేష్ కు తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు ఆయనకు తంబళ్లపల్లిలో ఏమి సంబంధం ఉందని ద్వారకానాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు దోషి జయచంద్రారెడ్డి ని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేయకపోవడంలో మీకున్న మైత్రి బంధాన్ని తెలియజేయాలని సూటిగా ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసులో అసలైన దోషి జయచంద్రారెడ్డిని వదిలేసి మాజీ మంత్రి, బీసీ వైసీపీ నేత జోగి రమేష్, జోగి రాము లను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత దాసరపల్లి జయచంద్రారెడ్డి ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంలో వున్న మతబు లేంటని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డి అసలు సూత్రధారంటూ సాక్షాత్తు టీడీపీ వాళ్లే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని నిస్సార్ అహ్మద్ ఆరోపించారు. సిఎం చంద్రబాబునాయుడు కు వ్యతిరేకంగా మాట్లాడారనే అక్కసుతో జోగి రమేష్ ను అక్రమ కేసులో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. జోగి రమేష్, జోగి రాము పైన కుట్ర పూరితంగా కేసులు నమోదు చేసారని సిట్ దర్యాప్తు వద్దని సీబీఐ తో దర్యాప్తు చేయించి నిజాన్ని నిగ్గు తేల్చటానికి కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని నిస్సార్ అహ్మద్ సూచించారు. ‌కోర్డులు, దర్యాప్తు సంస్థలపై మాకు అపార నమ్మకముందని సీబీఐ ద్వారా విచారణ చేపట్టి అసలు దోషులను రప్పించాలని సీబీఐ ద్వారా ఎంక్వైరీ చేయిస్తే సప్త సముద్రాలు దాటి ఉన్న అసలైన దోషులు భారత్ కు రప్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.‌ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మండిపడుతూ కేవలం మూడు సంవత్సరాలు కళ్ళు తెరిసి మూస్తే అయిపోతుందని తర్వాత అధికారంలోకి వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ నేతలపై కక్ష సాధింపుకు పాల్పడి ఏ నేరాలు చేయకున్నా అక్రమ నేరాలు మోపి అరెస్టు చేయించిన వారిని వదిలిపెట్టమని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను కూడా వదలమని వైయస్ జగన్ చెప్పినట్టు సప్త సముద్రాలు అవతల ఉన్న తప్పకుండా రప్పిస్తామని వైసీపీ వాళ్లను ఏడిపించిన ప్రతి ఒక్కరికి శిక్షలు తప్పవని మూడు సంవత్సరాలు ఆడింది ఆట పాడింది పాటగా సాగాలని ద్వారకానాథ్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తనయుడు పెద్దిరెడ్డి అభినయ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి తో పాటు మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు, వైసీపీ శ్రేణులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News