నేటి సాక్షి. :-పాములపాడు మండలం గ్రామం లో ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ షేరన్ ..ఆదేశముల మేరకు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ఆదేశాలు మేరకు ఆత్మకూరు రూరల్ సి.ఐ. సురేష్ కుమార్ రెడ్డి మేరకు, మరియు పాములపాడు SI సురేష్ బాబు ఆధ్వర్యంలో పాములపాడు మండలం కేంద్రంలో కార్టన్ సర్చ్ నిర్వహించడమైనది. ఎస్ ఐ.సురేష్ బాబు మాట్లాడుతూ రౌడీ షీటర్లు అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలోవిసృతంగా సోదాలు నిర్వహించి అక్రమ మద్యం కలిగి ఉన్న బాలయ్య ను అరెస్ట్ చేసి 25 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని అలాగే సరి అయిన ధ్రువపత్రాలు లేని 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. అని హెచ్చరించారు. *ఎస్ఐ సురేష్ బాబు మండల ప్రజలకు* *ముఖ్యమైన సూచనలు అవగాహన* *కల్పించడం జరిగింది* .రోడ్డు భద్రతపై పంచసూత్రాలు అయిన 1. హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని, 2. సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, 3. మద్యం త్రాగి వాహనము నడపరాదని, 4. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, 5. ఓవర్ లోడ్ ఆటోలలో ప్రయాణం చేయరాదని, తెలియజేయడం జరిగినది.మీరు నడుపు వాహనములకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, నడిపే వ్యక్తికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ లోన్స్, ఆప్స్, OTP ల గురించి, ఆన్లైన్ ట్రాన్సక్షన్స్, ఆన్లైన్ లో ఎవరైనా ఉద్యొగం ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని, అలాగే తెలిసినవారు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మవద్దని, స్వయంకృషిని నమ్ముకోవాలని తెలియజేయడం జరిగింది . మహిళలపై జరిగే నేరాలు గురించి, బాల్య వివాహాలు గురించి వివరించడం జరిగింది. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి కాబట్టి విలువైన ఆభరణములు, వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండవలెనని, ఒంటరిగా వెళ్లకూడదని, రైతులు పంట పొలాలకు మందులు కొట్టేటప్పుడు తప్పనిసరిగా నోటికి గుడ్డ కట్టుకోవాలని లేదా మాస్క్ వేసుకోవాలని తెలియజేయడం జరిగింది. లేనట్లయితే ఆ మందు పిచికారి చేసేటప్పుడు గాలిపీల్చి అస్వస్థకు గురవుతారని, ఇటీవల కాలంలో కొన్ని కుటుంబ కలహాలతో, అప్పులు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోకూడదని, మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవాలని తెలియజేయడం జరిగినది. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైందని, తల్లిదండ్రులు పిల్లలు పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎస్ఐ సురేష్ బాబు ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.





