Monday, March 16, 2026

* అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఐకేపీ వీవోఏలకు బడ్జెట్ పెంచాలి * రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి * ఐకేపీ వీవోఏ ఉద్యోగులకు 20 వేలు వేతనాలు ఇవ్వాలి * జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ఐకేపీ వీవోఏల ఆందోళన…

నేటి సాక్షి మార్చి 16 ( మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ, ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా *దుంపల రంజిత్ కుమార్ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) జిల్లా గౌరవ అధ్యక్షులు* మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీ ప్రకారం వీవోఏలకు రూ,ఇరవై వేలు వేతనం ఇస్తామని హామీనిచ్చింది.నేటికీ రెండు సం,లు గడుస్తున్న వీవోఏలకు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఈ బడ్జెట్ సమావేశంలోనైనా ఐకేపీ వీవోఏలకు రూ, ఇరవై వేలు వేతనం ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించాలి. *కుంటాల కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా అధ్యక్షులు* మాట్లాడుతూ.. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్, నెట్ సౌకర్యం కల్పించాలి. గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి. రూ, ఇరవై లక్షల సాధారణ భీమా, ఆరోగ్య భీమా, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి. గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనాలు వీవోఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలి. అర్హులైన వివోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలి. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. సెర్ఫ్ నుండి వీవోఏలకు ఐడి కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలి లేకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో దుర్గం రాములు ఐకేపీ వీవోఏ జిల్లా కార్యదర్శి, పొట్ట పోశం జిల్లా కోశాధికారి, భీంరాజ్, రాజ్యలక్ష్మి, కవిత,మల్లీశ్వరి, సమ్మయ్య, వసంత, శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News