నేటి సాక్షి, నారాయణపేట, ఫిబ్రవరి 1, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్),ఎందరో యోగులు, మహాత్ములు ఆచరించి అందించిన అహింసా మార్గంలో జీవించాలని ధ్యాన శాకాహార ప్రచార కార్యదర్శి బంగ్లా ఆంజనేయరెడ్డి,శివరాములు, హుస్సేనయ్య అన్నారు. మాత మాణిక్యేశ్వరి, బ్రహ్మర్షి పితామహా పత్రీజీ, తమ చివరి క్షణం వరకు శాఖాహారం గురించి ప్రబోధించి ఎందరినో శాకాహారులుగా మార్చారని వారు అన్నారు. ఆదివారం నాడు మరికల్ పట్టణంలో మాణిక్యేశ్వరి ట్రస్ట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మహా కరుణ అహింసా శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో వారు మాట్లాడుతూ గాంధీజీ, అంబేద్కర్, ఆదిశంకరాచార్య, బుద్ధుడు, పాటించిన అహింసా మార్గంలో నడుచుకోవాలని వారు అన్నారు. వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలో కూడా అహింసా మార్గం గురించి వివరించి ఉన్నదని వారు అన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు శాకాహారులు ఈ ర్యాలీలో పాల్గొంటూ పలు నినాదాలు చేశారు. శాఖాహారం ముద్దు మాంసాహారం వద్దు,, జీవహింస మహాపాపం, అహింసో పరమోధర్మః, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, శాఖాహారం అమృతహారం, మాంసం తింటే ఎనిమిది రకాల పాపాలు, పట్టణ పురవీధుల్లో ఈ ర్యాలీని నిర్వహించారు. శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేయడం ద్వారా, తాము పొందిన లాభాల గురించి పలువురు తమ అనుభవాలను ప్రజలకు తెలియజేశారు. పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో, సాయప్ప, బాలకృష్ణా రెడ్డి రగొట్టం ఆర్యా, గాంధీ మణెమ్మ, శివరాములు, చెన్నారెడ్డి, కనకప్ప, భీమేష్, తిరుపతయ్య, ప్రవీణ్, వెంకటేష్, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





