Friday, March 20, 2026

అహ్మదీపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

నేటి సాక్షి గజ్వేల్ : —-అహ్మదీపూర్ గ్రామంలో పీహెచ్‌సి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బ్యాగారి ప్రభాకర్, మెడికల్ ఆఫీసర్ డా. ప్రణయ్ రాజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ శిబిరంలో స్త్రీరోగ, శిశు, కంటి, ఎముకల (ఆర్థోపెడిక్), దంత, సాధారణ వైద్య నిపుణులు పాల్గొని గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. క్లస్టర్ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని ఔషధాలు పొందారు.పేద ప్రజలకు నిపుణ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, మహిపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News