నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్ 31 బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఉమ్మడి వెల్గటూర్ మండల పరిధిలోని ప్రధాన రహదారుల కూడలిలో వాహనాల తనిఖీలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించి బ్రెత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురు పట్టుబడగా, వారి వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్సై పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… నూతన సంవత్సరం వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని కారాదు వేడుకలు విషాదం అని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని, ఆంక్షలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, గ్రామాలలో పెట్రోలింగ్ కొనసాగుతాయని పేర్కొన్నారు.

