నల్లబెల్లి మండలంలో యూరియా కోసం రైతన్నలు తెల్లవారుజామునే లైన్లలో నిలబడి ఎదురుచూస్తున్నారు.నల్లబెల్లిలో అధికారులు ఒక్కో రైతుకు ఒక్క యూరియా బస్తా మాత్రమే అందజేస్తుండటంతో సమాన పంపిణీ జరుగుతోంది.గుండ్లపహాడ్ గ్రామంలో రైతులు ఉదయం 4 గంటల నుంచే యూరియా కోసం వేచిచూస్తుండడం వారి కష్టాన్ని చూపిస్తోంది.రబీ సీజన్ పంటల అవసరాల దృష్ట్యా మండలంలోని పీఏసీఎస్ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ మండల వ్యవసాయ అధికారులు చేపట్టారు. శనివారం PACS నల్లబెల్లిలో 444 యూరియా బస్తాలు,PACS మెదేపల్లి లో 444 యూరియా బస్తాలు,PACS గుండ్లపహాడ్ లో 333 యూరియా బస్తాలను రైతులకు అందించినట్లుమండల వ్యవసాయ అధికారి బన్న రజిత విలేకరులకు తెలిపారు.రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.సమయానికి ఎరువులు అందితే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతన్నల సహనం, క్రమశిక్షణే గ్రామీణ వ్యవసాయానికి బలమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

