Monday, December 23, 2024

ఆఖిబ్​.. అదిరిపోయే స్పీచ్​

  • – వేలాది మంది సమక్షంలో మైక్​ అందుకొని ప్రసంగం
  • – బాలుడిని మెచ్చుకున్న సందర్శకులు

నేటి సాక్షి, కరీంనగర్​ : స్టేజ్​ ఫియర్​ మనందరికి ఉంటుంది.. వేలాది మంది సమక్షంలో మైక్​ పట్టుకొని, మాట్లాడాలంటే.. అబ్బో.. అది మనతో కాని పని.. కానీ, కరీంనగర్​కు చెందిన 5 ఏండ్ల ఆఖిబ్​ మాత్రం మైక్​ పట్టుకొని, మాట్లాడితే అందరూ మంత్రముగ్ధులు కావాల్సిందే.. భయం.. బిడియం లేకుండా తాను చెప్పాల్సింది స్పష్టంగా చెప్పేస్తాడు. ఆఖిబ్​ తండ్రి ఆరిఫ్​ దబీర్​ మైక్రోసాఫ్ట్​ కాంపెనీలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​. ఈ బుడతడు లక్ష్య్​ స్కూల్​లో చదువుతున్నాడు. ఇటీవల కరీంనగర్​లోని అంబేద్కర్​ స్టేడియంలో లక్ష్య్​ ఇంటర్నేషనల్​ స్కూల్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మునావర్​ జమా ప్రేరణాత్మక కార్యక్రమంలో ఈ బుడతడు హాజరై, 20 వేల మందికి పైగా ప్రజల ముందు స్వాగత ప్రసంగం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిన్నారిని అనేక మంది వీక్షకులు ప్రశంసించారు. అతని భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ఈ బాలుడి స్పీచ్​ వీడియో గత రెండు రోజులుగా సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, మరికొందరు దానిని వాట్సాప్​ స్టేటస్​గా పెట్టుకున్నారు.

https://www.facebook.com/share/r/CjyzofPSXCNfxP8N/?mibextid=4UDYQrhttps://www.facebook.com/share/r/CjyzofPSXCNfxP8N/?mibextid=4UDYQr

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News