(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 25:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ మండల కేంద్రంలోని…రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు తండ్రి *అందెల ఆగమయ్య* ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలిసి *కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి* అందెల శ్రీరాములు నివాసానికి చేరుకొని *ఆగమయ్య* చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శ్రీరాములు కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు. *బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్* , రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ బిజెపి సీనియర్ నాయకులు తదితరులు నివాళులు అర్పించారు.





