నేటి సాక్షి, నల్లబెల్లి, జూన్ 21: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా శనివారం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఈ సందర్భంగా డాక్టర్ బానోత్ సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలు గెత్తి చాటి, ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన అపార మేధావి అని కొనియాడారు.
అదే విధంగా మలిదశ ఉద్యమానికి , తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కేసిఆర్ తో కలిసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర నలుమూలల గ్రామ గ్రామాన ఉద్యమ ఆకాంక్షను తెలిపేలా చేశారని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ చేట్టుపల్లి మురళీధర్ , మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు క్యాతం శ్రీనివాస్, నాగేల్లి శ్రీనివాస్. మాజీ ఉపసర్పంచ్ కొత్త గట్టు ప్రభాకర్ , లెంకాల పల్లి గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మామిళ్ళపేల్లి రాజు, మాజీ వార్డు మెంబర్ పెద్ద బోయిన రాజన్న , మాటూరి హరీష్ ,ఉప్పునూతల ప్రభాకర్, సద్దాం, హైమద్ ,తంగెళ్ళ వేణు, రాజు ఇతర నాయకులు పాల్గొన్నారు.

