Tuesday, January 20, 2026

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి…!!!

మద్యం సేవించి ఆటోలు నడిపితే జైలు శిక్షలు జరిమానాలు తప్పవు…!!!ఆటో డ్రైవర్లు విధిగా ఖాకి చొక్కా ధరించాలి…!!!రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి…!!!ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాల అవగాహన కార్యక్రమం…!!!జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్…!!!నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :ప్రయాణికులను, విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు, ఆటోలను నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు.బుధవారం రోజు జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్ వి, గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లకు వనపర్తి సీఐ, కృష్ణయ్య, ట్రాఫిక్ ఎస్సై, సురేందర్ వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అప్పుడే ప్రమాదాల సంఖ్యను తగ్గించగలుగుతామని ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి ఆటోలను నడపడం, నిర్లక్ష్యంగా రోడ్లపై ఇష్టానుసారంగా ఆటోలను నిలిపివేసి, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. డ్రైవర్ సీటు వెనక భాగంలో డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరును ప్రయాణికులకు కనిపించే విధంగా కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.పట్టణంలో కొన్ని రోజులుగా జరుగుతున్నా దొంగతనాల విషయంలో కూడా డ్రైవర్ల అప్రమత్తంగా అనుమానం ఉన్న వ్యక్తులపై కూడా ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేసారు.ఆటోలను అతివేగంగా నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండేలా తీసుకోవాలన్నారు. తాగి వాహనాలు నడపవద్దని. ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, ఆటో రిజిస్ర్టేషన్‌ నెంబర్‌ కనబడేలా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అప్పుడే ప్రమాదాల సంఖ్యను తగ్గించగలుగుతామని ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ, కృష్ణయ్య, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై, సురేందర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News