నేటి సాక్షి,వేమనపల్లిఆటో బోల్తా పడి పలువురు కూలీలకు గాయాలైన సంఘటన వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామ మలుపు వద్ద చేటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే ఆంధ్రా నుండి వచ్చిన కూలీలు ఆదివారం కావడంతో ముల్కలపేట ముసలమ్మ ఆలయం వద్ద మొక్కలు చెల్లించుకొని వస్తున్న క్రమంలో కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మద్యపానం సేవించి ఉండటంతో అదుపుతప్పి మూల మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుమారుగా 8 మంది కూలీలు ప్రయాణం చేస్తున్నారు దానిలో డ్రైవర్ తో సహా మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.క్షత గాత్రులను 108 ద్వారా చెన్నూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

