Thursday, March 19, 2026

ఆటో బోల్తా… ముగ్గురికి గాయాలుఇందిరా మహిళా శక్తి చీరలు తీసుకెళ్తుండగా ప్రమాదం

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. బెజ్జంకి మండల కేంద్రం నుంచి దేవక్కపల్లి గ్రామానికి ఇందిరా మహిళా శక్తి చీరలను తీసుకెళ్తున్న ఆటో దాచారం స్టేజి సమీపంలో రోడ్డుపై నియంత్రణ కోల్పోయి పక్కకు ఒరిగింది.ఈ ప్రమాదంలో దేవక్కపల్లి గ్రామానికి చెందిన మార్క పుశవ్వకు కాలికి, తలకు తీవ్ర గాయాలు కాగా, నోముల లహరి, చౌటపల్లి సౌజన్య స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News