Wednesday, March 11, 2026

ఆడపిల్లలకు చదువే ఆయుధం-అంగన్వాడీ లో ‘ప్రీ స్కూల్ విద్యను’ సద్వినియోగం చేసుకోండి : అర్భన్ సిడిపిఓ మమత

నేటిసాక్షి, మిర్యాలగూడ (జనవరి 24) : సమాజంలో ఆడపిల్లలకు చదువు ఒక గొప్ప ఆయుధమని, చదువు ఉంటే సమస్తాన్ని మనం జయించవచ్చని అర్బన్ సిడిపిఓ మమత అన్నారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగామిర్యాలగూడ అర్బన్ సిడిపిఓ రేఖల మమత ఆధ్వర్యంలో యూపీఎస్ గాంధీ పార్క్ పాఠశాల్లో బాలికలకు ఆడపిల్లల రక్షణ, బాల్యవివాహాలపై వ్యాచారచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలోని ఉత్తీర్ణులు అయిన బాలికలకు మొదటి బహుమతి దివ్య జ్యోతి, రెండవ బహుమతి శిల్ప కు అర్భన్ సిడిపిఓ మమత మరియు ప్రధానోపాధ్యాయులు కురువనాయక్ చేతుల మీదుగా బాలికలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థినిలు, బెలూన్స్ ఎగురవేస్తూ, ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణించాలంటే, చదువుపట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని, చదువు ప్రతి ఒక్కరికీ ఆయుధం లాంటిదని, అలాంటి ఆయుధం మనచేతిలో ఉంటే అన్ని రంగాలలో ఆడపిల్లలు ముందు ఉంటారని తెలియచేశారు. అనంతరం ప్రాజెక్టు పరిధిలోని ఇస్లాంపుర సెక్టార్ నెహ్రూనగర్-1అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి మమత హాజరై, అంగన్వాడి కేంద్రంలో విద్యను అభ్యసించడం వలన పిల్లలకు మానసిక, శారీరక అభివృద్ధి మెరుగుపడుతుందని, అందువలన పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటారని, అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు ప్రైవేటు కేంద్రాలకు ధీటుగా ప్రీస్కూల్ మెటీరియల్ అందుబాటులో ఉందని, పిల్లల పోషణ స్థితి మెరుగుపడేందుకు ఒకపూట భోజనం, ఉడికించిన గుడ్డు, మురుకులు అందిస్తున్నాం అని, ప్రజలు అంగన్వాడి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కె. నాగమణి, పోషణ అభియాన్ బ్లాక్ కో-ఆర్డినేటర్ కవిత, ప్రాథమికో ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ కురవ నాయక్, పిఇటి కిరణ్, ప్రవీణ్,అంగన్వాడి టీచర్లు రషీదా బేగం, కవిత, యాదమ్మ, లక్ష్మీ, పద్మజా, దేవి, షాహిన్ మున్నిస బేగం, ప్రీస్కూల్ చిన్నారులు, తల్లిదండ్రులు మరియు గర్భిణీలు, బాలింతలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News