నేటి సాక్షి వికారాబాద్/ మార్పల్లి:ఆడబిడ్డ పెండ్లికి అండగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీ మర్పల్లి మండలం అధ్యక్షులు రావులపల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డిస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామ సర్పంచిగా గెలుపొందిన వెంటనే గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ పెండ్లికి 16000/- రూపాయలు పెండ్లి కానుకగా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఇచ్చిన హామీ ప్రకారం శుక్రవారం రావులపల్లి గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కలీం కూతురు వివాహం జరుగగా ఇట్టి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి 16000/- వేల రూపాయలు పెండ్లి కానుకగా అందించిన మర్పల్లి మండలం బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రావులపల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





