నేటి సాక్షి (జనవరి-9) ఆత్మకూరు :- ఆత్మకూరు పట్టణంలోని, సిద్దపల్లె రోడ్డులో ఉన్న అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక అధికారి యు.రాజు ఆధ్వర్యంలో శాంతిరాం హాస్పిటల్ డాక్టర్లచే మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి వచ్చిన పట్టణంలోని ప్రజలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఏవైనా నయం కానీ రోగాలు ఉంటే నంద్యాల శాంతిరాం హాస్పిటల్ కు రేఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కె.ఈశ్వర్ నాయక్, కానిస్టేబుల్ లు షేక్.జిలాని, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, తదితర సిబ్బంది, వైద్య సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది.

