Wednesday, April 8, 2026

*ఆత్మకూరు డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి* *కొత్తగా వచ్చిన రెవిన్యూ డివిజనల్ అధికారి సి.వెంకట శివ ని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు*

నేటి సాక్షి 07 ఏప్రిల్ ఆత్మకూరు :–నందికొట్కూరు నియోజకవర్గంలో ని సమస్యల గురించి ఆర్డీఓ ఆఫీసు లో గతంలో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆర్డీవో సి.వెంకట శివ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం చేతికి అందజేసి అభినందనలు తెలియజేసి, విన్నవించారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లోని నందికొట్కూరు నియోజవర్గంలో మరియు శ్రీశైలం నియోజకవర్గంలో గతంలో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయని, ఇంతకుముందు పనిచేసిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో చాలా ఫైల్లు పెండింగ్ ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించి, రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News