Sunday, March 8, 2026

*ఆత్మకూరు పట్టణ అభివృదే మన రాజన్న ముఖ్య లక్ష్యం:: సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్*

నేటి సాక్షి 02 ఫిబ్రవరి ఆత్మకూరు:- ఈరోజు శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి సహకారంతో ఆత్మకూరు పట్టణంలోని, సాయిబాబా నగర్ నందు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 180 మీటర్ల రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణం కొరకు దాదాపు 21 లక్షల వ్యయంతో మంజూరు చేయించిన పనులకు భూమి పూజ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్, టిడిపి పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ లతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్- ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ మన శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక బద్ధంగా, ఆత్మకూరు పట్టణంలోని, ప్రతి ఏరియాను అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ రషీద్, యూనిట్ ఇంచార్జ్ నాగుర్ ఖాన్, టిడిపి సీనియర్ నాయకులు సుబ్బరాజు, మోహన్ చౌదరి, స్థానిక టిడిపి నాయకులు పెద్దన్న, మల్లికార్జున, కాంట్రాక్టర్ ఉపేంద్ర రెడ్డి, ఏఈ- షాహిర్, సిబ్బంది రమణ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News