Tuesday, March 10, 2026

ఆత్మహత్యలు వద్దు. ధైర్యంగా బతకడం ముద్దు పాల్వాయి హరీష్ బాబు

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 28

పెంచికల్పేట్. మండలంలోని అగర్ గూడ గ్రామానికి చెందిన తుమ్మిడ రాజశేఖర్ నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఉసిగొల్పిన వ్యక్తిని ఇదివరకే పోలీసు వారు రిమాండ్ చేయడం జరిగింది.
ఈ ఈరోజు వారి తల్లిగారు తుమ్మిడ లక్ష్మీ గారిని పరామర్శించి లక్ష రూపాయల చెక్కును అందించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చడం సరికాదని హితవు పలికారు. అలాగే పారాక్విట్ అనే గడ్డి మందు విరివిగా దుకాణాల్లో దొరుకుతుందని, ఆ గడ్డి మందు తాగితే నూటికి నూరు శాతం మంది చనిపోతున్నారనే విషయాన్ని అసెంబ్లీలో తాను ప్రస్తావించానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ గడ్డి మందును బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భాజపా మండల అధ్యక్షులు కుకిడే రాజేశ్వర్ , ఘనపురం నగేష్, బోయిరే నాన్నయ్య, పల్లెం పురుషోత్తం, కుకిడే వెంకన్న, పాలె సంతోష్, పాగిడి అనంత రావు, కాంతా రావు, సిరిపురం భీమయ్య వగాడి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News