బెజ్జంకి నేటి సాక్షి:
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు.