నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 21) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ (ఐ ఏ ఎస్) ప్రత్యేకంగా హైదరాబాద్ పిలుచుకొని సన్మానించారని శుక్రవారం ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ధర్మారం ఆదర్శ పాఠశాల లో సెప్టెంబర్ నెల 2024 వ తేదీ న ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నూతన ఆలోచనలతో విద్యార్థులకు అన్ని రకాల వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి అనునిత్యం కృషి చేస్తున్నారు. ప్రిన్సిపాల్ గా 12 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం లో సాధించిన విజయాలతో, స్వంత ఊరిలో ఉన్న ధర్మారం ఆదర్శ పాఠశాల సార్థోతోముకాభివృదికి అడుగులు వేయిస్తూ, విద్యార్థులు సాధించిన విజయాలతో ప్రతినెల మంత్లీ మ్యాగజైన్ (మాస పత్రిక) విడుదల చేసి, విద్యార్థులలో సామాజిక, క్రమశిక్షణ, సేవ భావం ఏర్పాటు కోసం (ఎస్ పి సి) స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ఏర్పాటు జరుగుతుందన్నారు. విద్యార్థులు మధ్యాహ్న బోజన సమయాన్ని కూడా వివిధ విషయాల పట్ల పూర్తి ఙ్ఞానాన్ని పొందటానికి పాఠశాలలో విద్యార్థులతో నిర్వహించే రేడియో ఎఫ్ ఎం 674.26 ఏర్పాటు చేసి, పాఠశాలలో వండే మిడ్ డే మిల్స్ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులందరూ తినేలా విద్యార్థులతో కలిసి మీల్స్ విత్ స్టూడెంట్స్ అనే కార్యక్రమంతో విద్యార్థులతో కలిసి ప్రతీ రోజు భోజనం చేయటం పాఠశాలలో ప్లాస్టిక్ నియంత్రించేలా ప్లాస్టిక్ రహిత పాఠశాల కార్యక్రమాలు నిర్వహించడం పాఠశాలలో విద్యార్థులందరూ సమాన అవకాశాలతో అన్ని క్రీడలలో పాల్గొనే విధంగా ప్లే ఫర్ ఆల్ కార్యక్రమం నిర్వహిస్తూ పాఠశాల క్రీడా విజయలను మరింత ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ తో పలు మార్లు చర్చలు జరిపి పాఠశాల కు అనుకొని ఉన్న గుట్టలతో నిండిన స్థలాన్ని క్రీడా మైదానం గా మార్చుటకు ప్రయత్నం చేయటం జరుగుతుందన్నారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కి పేరెంట్స్ చాలా మంది హాజరుకావటం లేదని విద్యార్థి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థి ఇంటికే ఉపాధ్యాయులు అని ఆదర్శ ఇంటి బాట కార్యక్రమం తో పలు గ్రామాలలో హోమ్ విసిట్ చేస్తున్నామన్నారు. ఇలా పలు వినూత్నమైన ఆలోచనలతో, కార్యక్రమాలతో పాఠశాలను అభివృద్ధి పథం లో నడిపిస్తున్న తీరును తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ (ఐ ఏ ఎస్) ఈనెల 20న హైదరాబాద్ కి ప్రత్యేకంగా పిలుచుకొని కార్యక్రమాల గురించి స్వయంగా తెలుసుకొని అభినందించి సత్కరించారని రాజ్ కుమార్ తెలిపారు. ఇలా ఉన్నత అధికారుల, పలువురు ప్రశంసలు అందుకున్న ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ విద్యార్థుల ,పాఠశాల అభివృధి కోసం మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లీ తండ్రులు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కి శుభాకాంక్షలు తెలిపారు.





