నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి మార్చ్ 18 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాపెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం హత్యకు గురైన ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)సిపిఎం జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ( TAGS) జిల్లా కార్యదర్శి నెర్పల్లి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ లు కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల నుండి హత్యాపూర్వ పరాల వివరాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీల పైన, మహిళల పైన దాడులు పెరిగాయని, దీనికి ప్రధాన కారణం గతంలో నేరాలు చేసిన వారికి కఠిన శిక్షలు పడకపోవడమేనని ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం స్పందించి ఆత్రం సమ్మక్క ను హత్య చేసిన కేర్కర్ జలపతిని, మరియు ఆయన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని, ఈ శిక్ష ద్వారా అయినా ఇంకెవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే భయపడేలా ఉండాలని కోరారు. ఆదివాసి మహిళను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేయడం జరిగిందని, సమ్మక్క ఏడు నెలల గర్భవతి అని రెండు ప్రాణాలు పోయాయని, కావున రెండు హత్య కేసులో నమోదు చేయాలని, అమ్మాయి బంధువుల ఇంటిదగ్గర ఉన్నప్పుడు తీసుకువెళ్లాడు కావున కిడ్నాప్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమ్మక్క కుటుంబం ఆదివాసీ నిరుపేద కుటుంబం కావున ఆ కుటుంబానికి ప్రభుత్వం వైపు నుండి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పకడ్బందీగా అమలు చేయాలని, ఈ మొత్తం అమలుకు పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ చేయాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించి తాసిల్దార్ వెంటనే గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ ,ఎస్పీ కూడా గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆత్రం సమ్మక్క కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని తెలిపారు..





