నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 20,* మరికల్ మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వారు నిర్వహించిన భగవత్ గీతా కంఠస్థ పోటిల్లో బహుమతులు సాధించి జిల్లా స్థాయికి అర్హత సాధించిన విద్యార్థులకు శ్రీవాణి పాఠశాల యాజమాన్యం శ్రీమతి & శ్రీ పూర్ణిమ వెంకటేశ్వర్లు గారు మరియు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వినీతమ్మ గారు అభినందనలు తెలియచేస్తు కృష్ణవేణి (10వ ),మౌనిక, నరేందర్(7వ ),అక్షిత (5వ ), మహమ్మద్ నిషు (4వ),బ్రమరాంబిక, మానస, నవ్య, సాత్విక్ రెడ్డి (2వ) మరియు రిత్వికశ్రీ (1వ తరగతి) విద్యార్థులను మరియు ఉపాధ్యాయడు రామాంజనేయులు గారిని సన్మానించడం జరిగింది.* ఇదే రీతిలో పాల్గొని జిల్లా స్థాయిలో మరోసారి ఉత్తమ ప్రదర్శన కనపరచాలి అని విద్యారులకు తెలియచేయడం జరిగింది.* ఈ కార్యక్రమం లొ విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.





