Monday, March 16, 2026

*ఆధ్యాత్మిక ప్రవచనంతోనే మానవాళి మనుగడ**కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాతానందగిరి స్వామి సందేశం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం:* కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా సందర్భంగా గొల్లపల్లి సమీపంలో ఉన్న శ్రీ శాంతి ఆశ్రమంలో బృహద్వాశిష్ఠ పీఠంలో భక్తి పారవశ్యంతో నిండిపోయింది, ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీమతాంగా మహా పీఠాధిపతి మాతానందగిరి స్వామి భక్తులకు ఆధ్యాత్మిక బోధన చేశారు. మానవజాతి మనుగడకు ధర్మం, శాంతి, సేవ అనే మూడు మూలాధారాలు అవసరమని స్వామిజీ పేర్కొన్నారు.ముందుగా స్వామివారికి ఉభయదారులైన మోమిడి శ్రీదేవి,మోమిడి లీలా కృష్ణ దంపతుల స్వగృహమునందు ప్రత్యేక పూజలు చేసి మేళా తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా తిమ్మరాజు పల్లి నుంచి రేణుకా పురం శివాలయం వరకు వచ్చారు అనంతరం శివుడికి గణపతి పూజతో ప్రారంభమై విభూదాభిషేకం, జలాభిషేకం, ఘనంగా గురుపూజ చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆథ్యాత్మిక ప్రార్థన, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా పీఠాధిపతి మానవాళికి ఉపయోగపడే సూక్తులు చేశారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి ఆలోచన శుభ్రమైతే ప్రపంచం పావనమవుతుంది. ఆధ్యాత్మికత మనసును మలుస్తుంది, మనుగడను కాపాడుతుందని మాతానందగిరి స్వామి భక్తులకు ఉపదేశించారు.ఈ కార్యక్రమాన్ని ఉభయ దారులు ముమ్మిడి శ్రీదేవి–లీలాకృష్ణ దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపమాలలు వెలిగించి, పూజలు, హారతలతో పౌర్ణమి వేడుకలను ఆరాధనాత్మకంగా జరుపుకున్నారు. ఆశ్రమ ప్రాంగణం నిండా ఓం నమో నారాయణాయ, శివ శివ శివాయ నమః ధ్వనులతో మార్మోగింది. అనంతరం ఉభయ దారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక ఆల్ ఇండియా కన్వీనర్ శ్యాం ప్రసాద్ , డిప్యూటీ సొలిసీటర్ జనరల్ హైకోర్టు ఆప్ ఆంధ్ర ప్రదేశ్ పున్నారావు , శ్రీ శాంతి ఆశ్రమ ఆర్గనైజర్ వెంకట్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రిటైర్డ్ రాష్ట్ర అధ్యక్షులు సామాజిక సమరసత వేదిక మన్మధరావు, న్యాయవాది ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గరిక ముక్కు సుబ్బయ్య, రిటైర్డ్ ఆర్మీ ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుటుకుల జాషువా, నిర్భయానంద మోహన స్వామి, కరస్పాండెంట్ డాక్టర్ పెనుబాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గీతాదేవి, ప్రముఖ గాయకులు పామూరు సుబ్రహ్మణ్యం, విరాళం ఇచ్చిన దాతలు, రైల్వే కాంట్రాక్టర్ మురళీ కృష్ణారెడ్డి, వికేర్ ఆర్ గ్యాస్ ఎండి మనోజ్ కుమార్ రెడ్డి, మన్మధరావు, సీజయంత్ నాగరాజు తదితరులు, అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు మాతంగి పీఠాధిపతి శాలువాలు కప్పి ఆశీర్వాదాలు అందించారు, భక్తులకు అన్నదానం తోపాటు దేవుని ప్రసాదం అందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News