టీపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య ముదిరాజ్…!!!
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
దేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నా లో టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు మహాధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య ముదిరాజ్.
మహాధర్నలో నందిమల్ల యాదయ్య మాట్లాడుతూ సమాజంలో ఎక్కడ అణిచివేత, పీడనం ,దోపిడి ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది కాబట్టి సమాజంలో ఎక్కడ అణిచివేత జరగకుండా ప్రభుత్వాలు సక్రమంగా నడపాలని అన్నారు.సమాజంలో శాంతిని కాపాడుతూ ప్రజలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి నక్సలైట్స్ తో శాంతిచర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న అమానవీయ చర్యను ఆపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ,వామపక్షాల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్లా, ద్వారపోగు విజయబాబు,నందిమల్ల రాము, నందిమల్ల సందీప్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు…

