నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారు రావు గారు ఆపరేషన్ కగారు పేరుతో బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే ఆపేయాలి అని సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి బంగారరావ్ డిమాండ్ చేశారు. సీపీఐ(యమ్.యల్) లిబరేషన్ అన్నమయ్య జిల్లా కమిటీ సమావేశం రాయచోటి టౌన్ లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి బంగార్రావు, రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సభ్యులు, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి ఉదయ్ కిరణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కామ్రేడ్ బంగార్రావు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ముందస్తుగా కస్టడీలోకి తీసుకుని, విచారణ న్యాయ ప్రక్రియ పాటించకుండా అతికిరాతకంగా చంపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని అన్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా కూడా కనీసం చర్చలకు పూనుకోకుండా బూటకపు ఎన్కౌంటర్ కు పాల్పడటం చాలా దారుణం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులను నిలిపివేసి ఈ హత్యలపై న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు పరచడంలో గోరంగా విఫలం అయి కూడా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్ )లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్, జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ్య పి రమణ సుజాత సుబ్బయ్య జయసింహ ఆంజనేయులు లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.