Monday, February 23, 2026

*ఆపి ఉన్న లారీకి బైక్ ఢీ… యువకుడు మృతి** హెచ్చరికలు లేకుండా వాహనం నిలిపివేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని సుభాష్ రోడ్డుకు చెందిన నల్లూరి నరేష్ (24), తండ్రి ఆనంద్, కులం సన్నాయిల, రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.*డెకరేషన్ పనికి వెళ్తూ ప్రమాదం*నరేష్ డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నెల 23న తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో తన స్నేహితుడి బైక్‌పై మెట్ పల్లి పట్టణంలోని ఒక ఫంక్షన్‌కు డెకరేషన్ పనికి వెళ్తున్నాడు.సుమారు రెండు గంటల సమయంలో కోరుట్ల ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు.ముందున్న లారీని గుర్తించకపోవడంతో నరేష్ ప్రయాణిస్తున్న బైక్ వెనుక నుంచి లారీకి ఢీకొట్టింది.దీంతో ప్రమాదంలో నరేష్ తలకు తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.*సిగ్నల్స్ – హెచ్చరికలు పెట్టకపోవడం వల్లే*ఆ సమయంలో జాతీయ రహదారిపై ఎలాంటి సిగ్నల్స్ లేదా హెచ్చరిక సూచనలు లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా లారీని నిలిపివేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని రహదారిపై నిలిపివేశాడని ఆరోపిస్తూ మృతుని తల్లి నల్లూరి యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిరంజీవి పేర్కొన్నారు.యువకుడి ఆకస్మిక మృతి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News