నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లిమండలంలోని పంచాయతీ కేంద్రం ఆమెని గుంట బస్సు సెంటర్ నందు తమిళనాడు కు చెందిన వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది స్థానికుల కథల మేరకు తమిళనాడు రాష్ట్రం సైదాపేట చెన్నై కు చెందిన రామ లక్ష్మమ్మ 65 అనే వృద్ధురాలు నాలుగు రోజుల క్రితం ఆమెని గుంటకు వచ్చింది ఎవరో యాచకరాలు వచ్చిందని స్థానికులు వృద్ధురాలికి భోజన వసతులు కల్పిస్తూ వచ్చారు ఈ క్రమంలో ఆ వృద్ధురాలు బస్సు షెల్టర్ నందు మృతి చెందింది తొలుత అనాధ శవంగా భావించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు తరలివచ్చి వృద్ధురాలి తో తెచ్చుకున్న బ్యాగును తనిఖీ చేశారు ఆ బ్యాగులో వృద్ధురాలి ఆధార్ కార్డు ఉండడంతో వారు రామలక్ష్మమ్మగా గుర్తించి మరో పేపర్లో సెల్ ఫోన్ నెంబర్ ఉండగా వారు ఆ నెంబర్కు ఫోన్ చేయగా వృద్ధురాలు తన అమ్మ అని వస్తున్నామంటూ వారు తెలిపారు మరల సంచిలో వెతుకగా రూ 1.08 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అంతేకాకుండా మూడు బ్యాంకు పాస్ పుస్తకాలు ఉన్నట్లు వారు గుర్తించారు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు





