Wednesday, February 25, 2026

*’ఆమె’ప్రాణం తీసిన అప్పు.!!*————————* అవమానభారంతో ఎస్సారెస్పీ కాలువలో దూకి మహిళ మృతి* జగిత్యాల మండలం ధరూర్ వద్ద విషాదం———*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )ఆర్థిక ఇబ్బందులు, అప్పు ఒత్తిళ్లు ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచాయి. అప్పు తీర్చలేకపోయిన అవమానభారంతో మహిళ కాలువలో దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల మండలంలో కలకలం రేపింది.*ఘర్షణ తర్వాత ఘటన.!*స్థానికుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కనగాలా అనూష (40) కుటుంబం కొన్నేళ్ల క్రితం తెలంగాణకు వలస వచ్చి ప్రస్తుతం జగిత్యాల పట్టణంలోని నూకపెల్లి అర్బన్ కాలనీలో నివసిస్తోంది. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి వచ్చిన కొందరితో డబ్బుల విషయంలో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష మధ్యాహ్నం ధరూర్ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లినట్లు చెబుతున్నారు.*ఎస్సారెస్పీ కాలువలో దూకిన మహిళ*అవమానభారం తట్టుకోలేక ఆమె ఎస్సారెస్పీ కాలువలో దూకినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శోధన చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో నూకపెల్లి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.—–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News