సాక్షి, ఎండపల్లి (రియాజ్): ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చునని అధికారులు అన్నారు. బుధవారం మండలంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పర్యటించారు. గొడిశేలపేట గ్రామంలో ఆయిల్ పామ్ తోటలను క్షేత్ర స్థాయిలో సందర్శించి సాగు మెలకువలు, దాని వలన రైతులకి కలిగే లాబాలను గూర్చి వివరించి, ఆయిల్ పామ్ సాగు విధానంపై అధిక దిగుబడి పొందేందుకు మార్గాలను అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సహ రాయితీ కల్పిస్తోందని రైతులు అవకాశంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క సారి మొక్క నాటి పంట మొదలైనప్పటి నుండి 30 ఏళ్ల పాటు రైతుకు దిగుబడి లభిస్తుందని అన్నారు. అదేవిధంగా ఈ పంటలో అంతర పంటలు సాగు చేసుకోవచ్చునని దీంతో అదనపు ఆదాయం కూడా పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో కమల్ల మహేష్, ఏఈవో లు సందీప్, మౌనిక, లావణ్య, హెచ్ఈవో యోహాన్, ఆయ గ్రామ రైతులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగు

