*నేటి సాక్షి- మేడిపల్లి* మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, మాట్లాడుతూ వరి, మొక్కజొన్నపంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు.ఆయిల్ పామ్ సాగు వలన రైతుకు నాలుగవ సంవత్సరం నుండి దిగుబడి వస్తున్నందు వలన ఈ నాలుగు సంవత్సరాలు రైతులు తమ సాంప్రదాయ పంటలైన కూరగాయలు, పసుపు, మొక్కజొన్న, ప్రత్తి, పప్పు దినుసులకు సంబంధించిన ఇతర పంటలను అంతర పంటలుగా వేసుకొని లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో కోతుల బెడద, అడవి పందుల బెడద మరియు చీడపీడలు, అకాల వర్షాలు, వడగండ్ల వానల వలన ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. ఆయిల్ పామ్ మార్కెటింగ్ విషయంలో రైతులకు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి జగిత్యాల జిల్లాకు కేటాయించిన లోహియా ఎడిబుల్ అయిల్స్ కంపెనీ ద్వారా కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేయబడింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కట్లకుంట గ్రామ సర్పంచ్ సుమలత ,ఉప సర్పంచ్ జలంధర్ రెడ్డి , Aeo రాధ , HEO అనిల్ కుమార్ , లోహియా కంపెనీ Fc శ్రావణ్, గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

