నేటి సాక్షి డిసెంబర్ 30 చేవెళ్ల న్యూస్ *చేవెళ్ల మున్సిపల్ కేంద్రం లోని హౌసింగ్ బోర్డుకాలనీలో ఆరు నెలలుగా బాగు చేయని మ్యానువల్* *ప్రమాదకరంగా మారిన రోడ్డు**ఎన్ని సార్లు విన్నవించినా నిద్ర మత్తులో మున్సిపల్ అధికారులు**పైసలు ఇస్తే కానీ ముందుకు కదలని పనులు**అయోమయంలో కాలనీ వాసులు*చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మ్యానువల్ ను అసంపూర్తిగా పూర్తిచేసి దాని చుట్టూ గ్రానైట్ రాళ్లు పెట్టి గాలికి వదిలేశారు గత ఆరు నెలలుగా ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాద కారంగా మారిన ఈ రోడ్డు గుండా నిత్యం వాహనాలు స్కూల్ బస్సులు నిత్యం వెళుతూ ఉంటాయని ఇంత చిన్న పనికి ఎందుకు అంత సమయం తీసుకుంటున్నారు అని అడిగితే దానికోసం ఇంజనీరు రావాలి దానికి ప్లాన్ చేయాలి దానికి డబ్బులు రిలీజ్ కావాలి అని కాకమ్మ కథలు చెబుతూనే ఉన్నాడు కాలనీలో ఇంటి పనులు మాత్రం ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు ఒకవేళ పన్ను కట్టడం లేటు ఐతే అసలు పన్నుకు మిత్తి వేసి వసూలు చేస్తున్నారని వాపోయారు అతి త్వరలో ఈ మ్యానువల్ రోడ్డు పనులు సకాలంలో చేయకపోతే కాలనీ వాసులు అందరూ కలిసి మునిసిపల్ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలిపారు

