పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారి సేవలు స్ఫూర్తివంతం.
పేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్
నేటి సాక్షి, నారాయణ పేట, జూన్ 30
విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ కే.బాలబ్రహ్మం ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ.
సోమవారం రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పదవి విరమణ పొందిన కోస్గి ఎస్సై -2 బాల బ్రహ్మం గారిని కుటుంబ సభ్యులను ఎస్పీ శ్రీ యోగేష్ గౌతం ఐపీఎస్ ఘనంగా సత్కరించారు. 1985 బ్యాచ్ కి చెందిన ఎస్సై బాల బ్రహ్మం పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి వివిధ హోదాల్లో 10 పోలీస్ స్టేషన్లలో 40 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసుకుని పదవి విరమణ పొందుతున్నందున ఎస్సై నీ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పదవి విరమణ పొందుతున్న ఎస్సై బాలబ్రహ్మం పోలీస్ శాఖలో ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన మీ సేవలను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు అని అన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. పోలీస్ శాఖలో ఫిట్నెస్ ముఖ్యమని 40 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఇంకా పూర్తిగా ఫిట్ గా ఉన్నందున ఎస్సైని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, శివశంకర్, కుటుంబ సభ్యులు భార్య శ్యామలమ్మ, పిల్లలు మమత, నరేందర్, నందకిషోర్ మరియు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.





