*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేశారని కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని అన్నారు.ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని అభివృద్ధి చేసి కార్మికులకు అండగా నిలిచిన మహానాయకుడు అని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి కార్మికులను రోడ్డున పడేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆర్టీసీ కార్మికులతో కలిసి పెద్ద స్థాయిలో ఉద్యమం చేపడతామని కంచర్ల రవి గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి వినయ్ వడ్లూరి వేణు ఎండి అజ్జు వరుణ్ ప్రశాంత్ సాయి నరేష్ పాల్గొన్నారు





