నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో హన్మకొండ తులసి బార్ దగ్గర మహమ్మద్ యాకుబ్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా, సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ వైపు నుండి వేములవాడ వెళ్తుండగా, బస్సు డ్రైవర్ బస్సును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు దాటుతున్న యాకుబ్ ని ఢీకొట్టగా, అతడికి తలకి మరియు ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.