Thursday, March 19, 2026

ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి ధన్వాడ మండలం టిఆర్ఎస్ యూత్ నాయకులు నర్సింలు….

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 20, నారాయణపేట జిల్లాలోని మరికల్ నుండి మంత్రోనిపల్లి బస్సు సౌకర్యం కల్పించాలని ధన్వాడ మండల టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎం. నర్సింలు కోరారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మరికల్ నుండి బస్సు రావడం లేదు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించడం లేదన్నారు. గ్రామానికి సకాలంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో అటు గ్రామస్తులకు ఇటు విద్యార్థులకు ఇబ్బందులు గురవుతున్నారు అన్నారు. స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ప్రస్తుతం నడిచి పోవడానికి పాఠశాలకు వెళ్లేసరికి క్లాసులు జరుగుతున్నాయి. గతంలో బస్సు వచ్చేటప్పుడు చక్కగా పాఠశాలకు విద్యార్థులు పోయేవారు ఇప్పుడు ప్రస్తుతం సక్రమంగా పోవడం లేదన్నారు. ప్రభుత్వం మారితే బస్సులు రావా ఇది ఎంతవరకు న్యాయమండి బస్సు డిపో మేనేజర్ గారికి అప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్తున్నారు.వస్తాది వస్తాది అని చెప్తున్నారు. పిల్లల చదువుతూనే చెలగాటం ఆడొద్దు అండి దయచేసి బస్సును వెంబడినే పంపించండి పంపియకపోతే గ్రామస్తుల విద్యార్థుల ఆధ్వర్యంలో ధర్నాకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎం నర్సింలు హెచ్చరించారు. .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News