నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని నాయి బ్రాహ్మణుడు వీరబాబు గత కొంతకాలంగా వెరీ కోసిస్ వ్యాధితో బాధపడుతూ కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉండటంతో, విషయం తెలుసుకున్న పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఆదివారం వీరబాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరబాబు కి నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎప్పుడు అండగా ఉంటారని, ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. పట్టణ నాయి బ్రాహ్మణ సభ్యులు సహకారంతో రూ.31వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆలగడప గిరిధర్, ఉపాధ్యాయ బిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్, గౌరవ అధ్యక్షులు హనుమంతు, పట్టణ అధ్యక్షులు నరసింహ, కార్యదర్శి సైదులు, నాగవెల్లి యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు.





