*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ ) గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి ఉతేమ్ వెంకయ్య ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందడం తో వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు దయా హృదయం తో తోచిన విధంగా ఆర్థిక సహాయం మొత్తం 15500అక్షరాలా పదిహేను వేల ఐదు వందల రూపాయలు వారి కుటుంబం కి అందచేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడo జరిగింది.ఓదార్చే మాటలకన్నా సహాయం చేసే చేతులె మిన్న ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ , కొలకాని జలంధర్,కాసారపు ప్రవీణ్ గౌడ్, కాళ్ళ రమేష్ రాఘవపట్నం సేవా సమితి అడ్మిన్ శ్రీపతుల శంకరయ్య కొండ రాజు రామ్ తదితరులు పాల్గొనడం జరిగింది

