*–నేటి సాక్షి – తెలంగాణ బ్యూరో*( రాధారపు నర్సయ్య )ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఆర్పీఐ (అంబేద్కర్) పార్టీ బరిలోకి దిగింది.జూబ్లీహిల్స్-61 అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా పబ్బతీ శ్రీకృష్ణ పేరును అధికారికంగా ప్రకటిస్తూ పార్టీ నాయకత్వం “B” ఫారం అందజేసింది.ఈ సందర్భంగా పార్టీ అధిష్టానంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.—*పార్టీ రాష్ట్ర కార్యాలయంలో..*హైదరాబాద్‌లోని రాష్ట్ర ఆర్పీఐ (అంబేద్కర్) పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ దీపక్ భౌ నీకల్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్‌లాల్ పాటిల్ జీ చేత “B” ఫారం జారీ చేయబడింది.రాష్ట్ర అధ్యక్షుడు కర్రె రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దక్షిణ భారత దేశ అధ్యక్షుడు (లీగల్) యలమంచిలి శేషగిరిరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడేటి పాల్ తదితరులు హాజరయ్యారు.*ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమైన అభ్యర్థి*“B” ఫారం అందుకున్న అనంతరం పబ్బతీ శ్రీకృష్ణ మాట్లాడుతూ..డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా చాటేందుకు ఈ ఎన్నికను వేదికగా చేసుకుంటానని అన్నారు.సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం, యువత సమస్యల పరిష్కారం కోసం తాను బరిలోకి దిగుతున్నానని తెలిపారు.పార్టీ నాయకత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఆయన, రాబోయే రోజుల్లో బలమైన ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తానని ప్రకటించారు.




