–ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్త ఆధ్వర్యంలో
వెల్గటూర్, నేటి సాక్షి (జగదీశ్వర్) జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం లోని కిషన్ రావుపేట్ గ్రామానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన రాయంచు సత్తయ్య హన్నమ్మ కూతురు ధనలక్ష్మి పుట్టుక తోనే అంగవైకల్యం తో బాధపడుతుంది గత రెండు సంవ్సరాలుగా బాధపడుతూ ఉండగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా గత రెండూ సంవత్సరాల నుండి ప్రతి నెల దాతల సహకారంతో ఈ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు నలుమాచ్ ప్రభాకర్ గుప్త ఉపాధ్యక్షులు కోలేటి సురేష్ గుప్తా వారి సహకారంతో 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్య క్రమంలో రాజేందర్ యాదవ్ దూట శ్రీనివాస్ పాక మహేందర్ ఆరేళ్లి రాహుల్ తదితరులు పాల్గొన్నట్లు ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్త తెలిపారు.

