నేటి సాక్షి …చిలుకూరు చిలుకూరు మండల ఆర్లగూడెం: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద ప్రయోజనదారులకు క్లెయిమ్ చెక్కులను తెలంగాణ గ్రామీణ బ్యాంకు చిలుకూరు శాఖ వారు ఆర్లగూడెం గ్రామంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట LDM వెంకట నాగ ప్రసాద్, బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సమత, APM వీరబాబు, పంచాయితీ కార్యదర్శి ప్రభాకర్, CFL కౌన్సిలర్లు, VOA శైలజ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.మృత్యువాత పడ్డ ఖాతాదారుల కుటుంబ సభ్యులు కన్నెకంటి సైదులు, ముదిగొండ సతీష్, షేక్ సలీం పాషా లకు మూడు బీమా క్లెయిమ్ చెక్కులను బ్యాంకు అధికారులు అందించినారు. PMJJBY పథకం ద్వారా ప్రతి సభ్యునికి మరణం సంభవించిన సందర్భంలో రూ.2 లక్షల బీమా లాభాలు అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి PMSBY, PMJJBY ఇన్సూరెన్స్ లు కలిగి ఉండాలని LDM వెంకట నాగ ప్రసాద్ గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

