Tuesday, March 17, 2026

ఆలయాన్ని నిర్మించాను దర్శనానికి ఆటంకం కల్పిస్తున్నారు : గిరినాథ్ ప్రకాష్..

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 9మూడు దశాబ్దాల క్రితం దేవస్థానం అభివృద్ధికి సొంత నిధులతో కృషి చేశానని దర్శనానికి ఆటంకం కల్పిస్తున్నారు అంటూ పారిశ్రామికవేత్త గాండ్లపల్లి వాసి అయిన గిరినాథ్ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం ఈ మేరకు గాండ్లపల్లి అభయ ఆంజనేయస్వామి ఆవరణలో ఆయన ప్రసంగిస్తూ 1990లో కొద్దిపాటి విస్తీర్ణంలో ఉన్న అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎలాగైనా నిర్మించాలని తపన తనలో వచ్చిందన్నారు తన కోరికను తండ్రితో తెలిపానని అప్పట్లో స్తోమత లేక అలాగే ఉండిపోయానన్నారు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిన తర్వాత తన కోరిక నెరవేర్చుకోవాలని నెపంతో స్వామివారికి ఆలయ నిర్మాణం అంచెలుగా చేపట్టి తాను సైతం పరిశ్రమ స్థాపించి ప్రయోజకుడు అయిన తర్వాత ఆలయాన్ని సంపూర్ణంగా నిర్మించాలని తలచి పూర్తి చేశానన్నారు అయితే తమ గ్రామంలోనే ఒక వ్యక్తి గర్భాలయం నిర్మాణ పనులు చేపడుతున్నానని తెలియడంతో పూర్తి బాధ్యతలు అతన్నే తీసుకోవాలని తెలిపినప్పటికీ తర్వాత తానే నిర్మించాలని అనడంతో ఆలయాన్ని పూర్తి చేశాను అన్నారు ప్రతి ఆదివారం పౌర్ణమి రోజున తన ఆధ్వర్యంలోనే అప్పటినుంచి స్వామివారికి వివిధ కైంకర్యాలు నిర్వహించేవారుమన్నారు అంతేకాకుండా హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా జరిపే వారమని ఆయన పేర్కొన్నారు అయితే తమ గ్రామంలోనే ఒక వ్యక్తి స్వామివారి దర్శనానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు తాను దర్శనానికి వస్తే ఆలయ గేట్లు వేసి తాళాలు ఇచ్చేవారు కాదని తాను కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉన్నానని స్వామివారి దర్శనానికి వస్తే తాళాలు వేసి తాళం చెవి తనకు ఇవ్వకుండా వెళ్లే వారన్నారు ఈ విషయమై గ్రామస్తులతో సంప్రదింపులు జరుపుతున్నానని స్వామివారి దర్శన భాగము కల్పించి పూజాది కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయాలని అభయ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను అని ఆయన వివరించారు అనంతరం జరిగిన ఉదంతా నంతా గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో వేలూరు రమణయ్య కంపల్లి రామస్వామి నూనె దామోదర్ కంపల్లి సరస్వతమ్మ కంపల్లి సుబ్రహ్మణ్యం గంగులప్ప జే రమణ జనార్దన్ రాజు వెంకటరెడ్డి గాండ్లపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News