నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* మండలంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ముంజంపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీని దొంగలు పగులగొట్టి, సుమారు రూ.50,000 వరకు చోరీ చేసినట్లు సమాచారం. దుండగులు అపహరించిన హుండీని గ్రామ శివారు ప్రాంతంలో వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న బసంత్‌నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.





