నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్:ఈ రోజు ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారిని, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, ఆత్మ చైర్మన్ గడ్డల సత్యన్న, డైరెక్టర్లు గాజుల జక్కయ్య, వైరగడే మారుతి, మొర్లె విశ్వనాథ్ గార్లను బూరుగూడ మాజీ సర్పంచ్ మణికొండ సంతోష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త గాజుల అశోక్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మణికొండ సంతోష్ మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటీ పాలకవర్గం ఐక్యతతో, సమన్వయంతో పనిచేసి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

