Monday, March 9, 2026

ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ కు సన్మానం

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి మార్చ్0 9 అసిఫాబాద్ : ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన ఎండీ అహ్మద్ కు సోమవారం ఆసిఫాబాద్ పట్టణ ముస్లిం యూత్ సభ్యులు ఆయన కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ కు పూలమాల శాలువతో ఘనంగా సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ పట్టణ అభివృద్ధికి ఐక్యతగా ముందుకెళ్లి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఆసిఫాబాద్ పట్టణ అభివృద్దే లక్ష్యంగా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆశయాల సాధనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సయ్యద్ ఉబెద్ అలీ, అబ్దుల్లా, మొయిన్, మన్వర్ ఖాన్, ఫయాజ్ ఖాన్, అజం, అతిక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News