నేటి సాక్షి పాలేరు , నవంబర్ 28:తపాలా శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఫిలాటికల్ ఎగ్జిబిషన్(స్టాంపుల ప్రదర్శన)ను శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ బో స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్టాంపులను ఆసక్తిగా తిలకించారు. పోస్టల్ స్టాంపు చరిత్రను తెలుసుకున్నారు. 108 ఫ్రేముల్లో 3,456 జాతీయ, అంతర్జాతీయ స్టాంపులను చూశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాడెంట్ మాట్లాడుతూ.. ఫిలాటిల్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చనని తెలిపారు. నేటి విద్యార్థులకు సోషల్‌మీడియా తెలిసినంతగా పోస్టాఫీసు గురించి తెలిసే అవకాశం లేదన్నారు. విజ్ఞానంతో పాటు మన చరిత్రను తెలుసుకునే అవకాశం ఫిలాటికల్ ఎగ్జిబిషన్ ద్వారా లభించిదన్నారు. మన చరిత్ర, మన వైభవాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ఒక సువర్ణ అవకాశమన్నారు. దీని ద్వారా భారతదేశ చరిత్రపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. నేటి తరానికి చరిత్రను అందించే అవకాశం లభించిందన్నారు. దేశ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఈ ప్రదర్శనకు తీసుకవెళ్లినట్లు పేర్కొన్నారు.





