నేటి సాక్షి, దేవరకద్ర జులై 8
ప్రతి ఒక్కరు తమ ఇళ్ళలో విద్యార్థుల చదువు కోసం ఒక చదివే మూలను ఏర్పాటు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు కవిత అన్నారు. దేవరకద్ర మండలం పెద్ద రాజమూర్ ఎంపి యుపిఎస్ పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల (పిటిఎం) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత మాట్లాడారు. ఇండ్లలో ఏర్పాటు చేసుకునే చదువు మూలలో చదువుకు సంబంధించిన వివిధ సామాగ్రి మరియు ఆ గది పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దీని ఏర్పాటుకు తల్లిదండ్రుల సహాయం ప్రోత్సాహం విద్యార్థులకు చాలా అవసరం అన్నారు. అలాగే ఉపాధ్యాయులు మాట్లాడుతూ మీ పిల్లలకు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఇంటి పనులు హోంవర్క్ చేసుకుంటున్నారా.. లేదా.. అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. తమ పిల్లలపై తల్లిదండ్రుల ఆజమాయిషి పెట్టాలన్నారు. ప్రతిరోజు కాస్త సమయాన్ని తమ పిల్లల కోసం తల్లిదండ్రులు కేటాయించాలన్నారు. కాసేపు వారితో మాట్లాడడం, కొన్ని మంచి విషయాలు తెలియచేయడం,వారితో కలిసి ఆడటం వంటి పనులను తల్లిదండ్రులు చేయాలని సూచించారు. పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాల గురించి, పాఠశాల పరిశుభ్రత గురించి విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత గురించి, అదే విధంగా పిల్లల ప్రవర్తనలో గాని, చదువు విషయంలో గానీ వచ్చే మార్పును తల్లితండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. ఆ విషయాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు తల్లితండ్రులు తెలియజేయాలని కోరారు. పిల్లలకు మంచిగా చదువులు నేర్పించే బాధ్యత తమపై ఉందని ఉపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే.శంకర్,