Thursday, February 19, 2026

*ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలి** పురోగతిపై సమీక్ష నిర్వహించిన జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ ——*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను శాతం వందకు గ్రౌండ్ చేసి, నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.*పెండింగ్ ఇళ్లకు తక్షణ చర్యలు*మార్క్ ఔట్ చేయని పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఇందిరమ్మ ఇండ్లకు వెంటనే ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని సూచించారు. మార్క్ ఔట్ చేయని ఇళ్లపై రద్దు ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు. ప్రారంభించిన పనులు త్వరగా బేస్మెంట్ స్థాయికి చేరేలా పర్యవేక్షణ పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీడీవోలు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.*మరుగుదొడ్లు – రుణాల సదుపాయం*ఇందిరమ్మ ఇండ్లకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని సూచించారు. మరో విడత ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్చి నాటికి వివిధ దశల్లో ఉన్న ఇండ్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. నిధుల కొరత ఉన్నచో మహిళా సంఘాల ద్వారా స్వయం సహాయక రుణాలు కల్పించాలని సూచించారు.*ఆన్‌లైన్ నమోదు – బిల్లుల చెల్లింపులు*ఇళ్ల నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.*తాగునీరు – ఉపాధి హామీ సమీక్ష*ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. మోటార్లు, పైప్‌లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆమోదిత పనులు, గ్రౌండింగ్ పురోగతి, కూలీల చెల్లింపుల వివరాలు సమీక్షించి, అర్హులైన వారికి సమయానికి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*పన్నుల వసూళ్లపై దృష్టి*గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లను శాతాల వారీగా సమీక్షించి, లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లు పెంచాలని సూచించారు. పెండింగ్ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వసూళ్లలో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ గౌతమ్ రెడ్డి, డీఆర్‌డీవో రఘువరన్, డీపీవో మదన్ మోహన్, సంబంధిత శాఖల ఈఈలు, డీఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఏఈలు, ఎంపీవోలు, క్లస్టర్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.——-

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News